Dandruff : మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తుంది. తలలో చర్మం పొడిబారడం, వాతావరణ కాలుష్యం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, ఇన్ఫెక్షన్స్ వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు రాలడం, చికాకు వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లభించే యాంటీ డాండ్రఫ్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడినప్పటికి ఎటువంటి ఫలితం లేక మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
చుండ్రు సమస్యతో బాధపడే వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. చుండ్రు సమస్యను తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ కోడిగుడ్డును, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తల చర్మాన్ని అంటేలా బాగా పట్టించాలి. దీనిని అరే వరకు అలాగే ఉంచి ఆ తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు సమస్య తగ్గుతుంది.
చర్మానికి కావల్సిన తేమ లభించి చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఈచిట్కాను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంలో పాటు జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒకసారి వాడడం వల్ల మనం చాలా సులభంగా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.