Bad Breath : ఏం చేసినా నోటి దుర్వాస‌న పోవ‌డం లేదా.. అయితే ఒక్క‌సారి ఇలా చేసి చూడండి..!

Bad Breath : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉండే వారు కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా న‌లుగురిలో చ‌క్క‌గా మాట్లాడ‌లేక‌పోతుంటారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నోటిని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడ‌డం, నోటి ఇన్ఫెక్ష‌న్స్, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం, నీటిని త‌క్కువ‌గా వాడ‌డం, నోరు పొడిబారడం వంటి వివిధ కార‌ణాల చేత నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్తుతుంది.

అలాగే శ‌రీరంలో ఏదైనా అనారోగ్య స‌మ‌స్య కూడా ఉంటే కూడా నోటి దుర్వాస‌న స‌మ‌స్య తలెత్తుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మౌత్ ఫ్రెష్ ల‌ను వాడ‌డం వంటివి చేస్తూ ఉంటారు. మౌత్ ఫ్రెష్ ల‌ను వాడే అవ‌స‌రం లేకుండా కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవ‌చ్చు. నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించే ఆ చిట్కాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు దంతాల‌తో పాటు నాలుక‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. టంగ్ క్లీన‌ర్ ను ఉప‌యోగించి నాలుక‌పై ఉండే పాచిని తొల‌గించుకోవాలి. అలాగే భోజ‌నం చేసిన త‌రువాత ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే నోరు పొడిబార‌కుండా చూసుకోవాలి.

Bad Breath wonderful home remedy try once
Bad Breath

నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి. నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో పుదీనా, ల‌వంగాలు, యాల‌కులు, సోంపు, తుల‌సి వంటివి చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. వీటిలో ఏదో ఒక‌టి నోట్లో వేసుకుని త‌ర‌చూ న‌ములుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించ‌డంతో పాటు నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌ను వాడిన‌ప్ప‌టికి స‌మ‌స్య త‌గ్గ‌క‌పోతే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి శ‌రీరంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయో ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts