Sapota Milkshake : స‌పోటాల‌తో ఎంతో చ‌ల్ల‌గా.. రుచిగా ఉండే మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Sapota Milkshake : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో స‌పోటా కూడా ఒక‌టి. స‌పోటా చాలా రుచిగా ఉంటుంది. వీటిని మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా స‌పోటా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. స‌పోటా పండ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ మిల్క్ షేక్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. స‌పోటాల‌తో రుచిగా, చ‌ల్ల చ‌ల్ల‌గా మిల్క్ షేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స‌పోటా మిల్క్ షేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సపోటాలు – 5, కాచి చ‌ల్లార్చిన పాలు – అర గ్లాస్, పంచ‌దార – 2 టీ స్పూన్స్, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఐస్ క్యూబ్స్ – త‌గిన‌న్ని.

Sapota Milkshake recipe in telugu very cool and tasty
Sapota Milkshake

స‌పోటా మిల్క్ షేక్ త‌యారీ విధానం..

ముందుగా స‌పోటాలపై ఉండే పొట్టును అలాగే వాటిలో ఉండే గింజ‌ల‌ను తీసేసి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే పాలు, పంచ‌దార, ఐస్ క్యూబ్స్ వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌పోటా మిల్క్ షేక్ త‌యార‌వుతుంది. ఇందులో పంచ‌దార‌కు బదులుగా తేనె లేదా డేట్ సిర‌ప్ ను కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా స‌పోటా మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. పిల్ల‌లు దీనిని ఇష్టంగా తాగుతారు.

Share
D

Recent Posts