Banana Peel For Cracked Heels : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు ఒకటి. అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. అరటి పండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గిచండంలో అరటి పండు మనకు ఎంతో దోహదపడుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. మనం సాధారణంగా అరటి పండును తిని అరటి పండు తొక్కను పడేస్తూ ఉంటాం. కానీ అరటి పండు తొక్క కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. అరటి పండు తొక్క వల్ల మనకు కలిగే వివిధ రకాల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు కాళ్లల్లో ముళ్లు గుచ్చినప్పుడు లేదా చిన్న చిన్న గాజు ముక్కలు గుచ్చుకున్నప్పుడు వాటిని తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటప్పుడు అరటి పండును తొక్క నుండి చిన్న ముక్కను తీసుకుని గాజు సీసా లేదా ముళ్లు గుచ్చిన చోట పసుపు భాగం పైకి వచ్చేలా ఉంచాలి. తరువాత ఈ అరటి మీద నుండి బ్యాండేడ్ వేసి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. ఉదయాన్నే తీసి చూస్తే ముళ్లు లేదా గాజు ముక్క దానంతట అదే బయటకు వస్తుంది. అలాగే మన కాళ్ల పగుళ్లను తగ్గించడంలో కూడా అరటి పండు తొక్క మనకు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు అరటి పండు తొక్కను కాలి అడుగు భాగంలో ఉంచి దానిపై నుండి సాక్స్ వేసుకోవాలి. ఉదయాన్నే అదే అరటి పండు తొక్కతో కాళ్ల పగుళ్ల మీద బాగా రుద్దాలి. చర్మం మెత్తబడిన తరువాత బ్రష్ తో లేదా స్క్రబర్ తో బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గుతాయి.
అదే విధంగా గాయాలు తగిలి రక్తం గడ్డకట్టుకుపోయినప్పుడు ఆ భాగంలో మనకు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాంటి భాగంలో రాత్రి పడుకునే ముందు తగినంత అరటి పండు తొక్కను ఉంచి మెత్తటి వస్త్రంతో కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పి తగ్గడంలో గడ్డకట్టిన రక్తం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే పులిపర్లను తొలగించడంలో కూడా మనకు ఈ అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. అరటి తొక్కపై ఉండే తెల్ల భాగాన్ని స్పూన్ తో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిరిపై ఉంచాలి. తరువాత దానిపై చిన్న అరటి పండు తొక్కను ఉంచి ఎక్స్ ఆకారంలో ప్లాస్టర్ వేసుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు వేసి ఉదయాన్నే తీసి వేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. మొటిమల సమస్యను తగ్గించడంలో కూడా అరటి తొక్క మనకు ఉపయోగపడుతుంది.
అరటి తొక్కను తీసుకుని మొటిమలపై సున్నితంగా రుద్దాలి. తడి ఆరే వరకు అలాగే ఉంచి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం మొటిమలను తగ్గించుకోవచ్చు. అలాగే సొరియాసిస్ తో బాధపడే వారు కూడా చర్మంపై అరటి పండు తొక్కతో సున్నితంగా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సొరియాసిస్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఉండడంతో పాటు చర్మం కూడా ఎక్కువగా పగలకుండా కూడా ఉంటుంది. అలాగే దోమలు కుట్టినప్పుడు ఆ భాగంలో మంట, దురద ఎక్కువగా ఉంటుంది. దోమ కుట్టిన చోట అరటి పండు తొక్కతో రుద్దడం వల్ల మంట, దురద రెండూ కూడా వెంటనే తగ్గుతాయి. ఈ విధంగా అరటి పండు తొక్క మనకు ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.