Kabuli Chana Roast : కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్ ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తింటే వ‌ద‌ల‌రు..

Kabuli Chana Roast : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే వీటితో నేరుగా కూర‌ల‌ను కూడా చేస్తారు. వీటిని ఉడక‌బెట్టి పోపు వేసి గుగ్గిళ్ల మాదిరిగా తింటారు. ఎలా తిన్నా స‌రే.. శ‌న‌గ‌లు భ‌లే రుచిగా ఉంటాయి. ఇక శ‌న‌గ‌ల్లో అనేక ర‌కాలు ఉంటాయి. మ‌నం త‌ర‌చూ న‌ల్ల శ‌న‌గ‌ల‌ను వాడుతాం. అలాగే కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక ర‌కం. ఇవి పొట్టు లేకుండా కాస్త పెద్ద‌గా ఉంటాయి. వీటితోనూ కూర‌ల‌ను చేస్తుంటారు. అయితే కాబూలీ శ‌న‌గ‌ల‌ను వేయించి స్నాక్స్‌లా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. కాబూలీ శ‌న‌గ‌ల‌తో రోస్ట్ ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాబూలీ శ‌న‌గ‌లు – 1 క‌ప్పు, నీళ్లు – త‌గిన‌న్ని, ఉప్పు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్లు, వంట సోడా – పావు టేబుల్ స్పూన్‌, రాక్ సాల్ట్ – అర టేబుల్ స్పూన్‌, గ‌రం మ‌సాలా పొడి – పావు టేబుల్ స్పూన్‌, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – పావు టేబుల్ స్పూన్‌, కారం – అర టేబుల్ స్పూన్‌, చాట్ మ‌సాలా పొడి – పావు టేబుల్ స్పూన్‌, ఆమ్ చూర్ – చిటికెడు, న‌ల్ల మిరియాల పొడి – పావు టేబుల్ స్పూన్‌.

Kabuli Chana Roast recipe in telugu very tasty snacks
Kabuli Chana Roast

 

కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్‌ను త‌యారు చేసే విధానం..

ఒక పాత్ర తీసుకుని అందులో కాబూలీ శ‌న‌గ‌ల‌ను వేయాలి. అందులోనే వంట సోడా, ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోయాలి. శ‌న‌గ‌ల‌ను అలాగే రాత్రంతా నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు నీళ్ల‌ను వంపేయాలి. ఇప్పుడు నానిన శ‌న‌గ‌ల‌ను ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వేసి ఒక క‌ప్పు నీళ్ల‌ను పోయాలి. ఇప్పుడు మూత పెట్టి ఎక్కువ మంట‌పై శ‌న‌గ‌ల‌ను ఉడికించాలి. ఒక్క విజిల్ రాగానే స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అనంత‌రం అందులో ఉండే నీళ్ల‌ను వంపేయాలి. త‌రువాత శ‌న‌గ‌ల‌ను ఒక శుభ్ర‌మైన వ‌స్త్రం మీద పోసి విస్త‌రించాలి. వాటిని ఫ్యాన్ కింద ఆర‌బెట్టాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో నూనె వేసి కాగిన త‌రువాత ఉడికిన శ‌న‌గ‌ల‌ను వేసి క్రిస్పీగా వేయించాలి.

శ‌న‌గ‌లు వేగిన త‌రువాత అందులో మ‌సాలా పొడిని క‌ల‌పాలి. అందుకు గాను గ‌రం మ‌సాలా పొడి, చాట్ మ‌సాలా, ధ‌నియాల పొడి, రాక్ సాల్ట్‌, జీల‌క‌ర్ర పొడి, ఆమ్ చూర్‌, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి మెత్త‌ని పొడిలా పట్టుకోవాలి. దీన్ని అంత‌కు ముందు వేయించి పెట్టుకున్న శ‌న‌గ‌ల‌పై వేసి బాగా క‌ల‌పాలి. దీంతో కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్ రెడీ అవుతుంది. దీన్ని సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్‌లా తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts