Banana Peel : రాత్రిపూట అర‌టి పండు తొక్క‌ను ముఖానికి రుద్దండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana Peel : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండు మ‌న‌కు ఎల్లవేళ‌లా ల‌భ్య‌మ‌వుతుంది. అర‌టి పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే సాధార‌ణంగా మ‌నం అర‌టి పండును తిని అర‌టి తొక్క‌ను పాడేస్తూ ఉంటాం. కానీ అర‌టి తొక్క కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అర‌టి తొక్క‌లో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అర‌టి తొక్క ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. చ‌ర్మం ఉండే ముడ‌త‌ల‌ను, మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను, గాయ‌ల వ‌ల్ల క‌లిగిన మ‌చ్చ‌ల‌ను తొల‌గించ‌డంలో అర‌టి తొక్క మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది.

తాజా అర‌టి తొక్క‌ను ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఒక ముక్క‌ను తీసుకుని మ‌న ముఖానికి రుద్దుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ అర‌టి తొక్క‌ను రాత్రి ప‌డుకునే ముందు ముఖానికి రుద్దుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే అర‌టి తొక్క‌ను ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఒక జార్ లో నాలుగు అర‌టి తొక్క ముక్క‌ల‌ను, ఒక చిన్న ముక్క అర‌టి పండును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండి, అర టీ స్పూన్ తేనె వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Banana Peel for beauty how to use it
Banana Peel

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. అలాగే ఈ మిశ్ర‌మంలో నిమ్మ‌ర‌సం, పెరుగు క‌లిపి ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. అదే విధంగా చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, ట్యాన్ పేరుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఇదే మిశ్ర‌మంలో బియ్యం పిండికి బ‌దులుగా శ‌న‌గ‌పిండి వేసి క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన మృత‌క‌ణాలు, మురికి తొల‌గిపోయి చ‌ర్మం అందంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా అర‌టి తొక్క మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

D

Recent Posts