Dahi Aloo Curry : రెస్టారెంట్లలో ల‌భించే ద‌హీ ఆలు క‌ర్రీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Dahi Aloo Curry : మ‌నం బేబి పొటాటోల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బేబి పొటాటోల‌తో చేసిన కూర‌ల‌ను కూడా చాలా రుచిగా ఉంటాయి. బేబి పొటాటోలతో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ద‌హీ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. బేబి పొటాటో, పెరుగు వేసి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. బేబి పొటాటోల‌తొ ద‌హీ ఆలూ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌హీ ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, 80 శాతం ఉడికించిన బేబి పొటాటో – 15, ఇంగువ – రెండు చిటికెలు, ఉప్పు – త‌గినంత‌, దంచిన మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌ళోంజి – రెండు చిటికెలు, చిన్న‌గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – రెండు చిటికెలు, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, మిరియాల పొడి – అర టీ స్పూన్, ట‌మాటాలు – 2, చిలికిన పెరుగు – 300 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dahi Aloo Curry recipe in telugu make it in restaurant style
Dahi Aloo Curry

ద‌హీ ఆలూ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉడికించిన బేబి పొటాటోను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఇంగువ‌, అర టీ స్పూన్ ఉప్పు, దంచిన మిరియాలు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, క‌ళోంజి విత్త‌నాలు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి.

మ‌సాలాల‌ను చ‌క్క‌గా వేయించిన త‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత వేయించిన బేబి పొటాటో వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో మూడు నిమిషాల పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పెరుగు వేసి క‌ల‌పాలి. పెరుగు అంతా క‌లిసిన త‌రువాత స్ట‌వ్ మీద ఉంచి మ‌ర‌లా వేడి చేయాలి. దీనిపై మూత‌ను ఉంచి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ద‌హీ ఆలూ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బేబీ పొటాటోల‌తో త‌యారు చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts