Beauty Tips For Men : పురుషులు త‌మ ముఖం అందంగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Beauty Tips For Men : అందంగా క‌న‌బ‌డాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారు. స్త్రీల‌తో పాటు పురుషులు కూడా అందంగా క‌న‌బ‌డాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. అందంగా, ఆరోగ్యంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలంటే కొన్ని ర‌కాల ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆందంగా క‌న‌బ‌డ‌తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ర‌క‌మైన ఆహారాలు పురుషుల శ‌రీరంలో ఆండ్రో స్టెనాస్, ఆండ్రో స్టెనాల్ అనే హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఇవి శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ఆహారాల్లో ఎక్కువ శాతం మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ మ‌రిము యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి.

పురుషులు ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షించ‌గ‌ల‌రు. పురుషుల అందాన్ని పెంచే ఆహారాల్లో క్యారెట్ ఒక‌టి. ఇది శ‌రీర ఆరోగ్యానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. క్యారెట్ లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల అనేక ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇవ్వ‌డంతో పాటు శ‌రీరంలో విట‌మిన్ ఎ ను బీటా కెరోటిన్ గా మార్చి ఆరోగ్య‌వంతంమైన చ‌ర్మాన్ని ఇవ్వ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి. క్యారెట్ నోట్లో లాలాజ‌లాన్ని ఎక్కువ‌గా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

Beauty Tips For Men must follow these for glow
Beauty Tips For Men

క్యారెట్ లో ఆల్క‌నిన్ అంశాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆమ్లా, క్షార ఉత్పత్తిని స‌మ‌తులం చేసి ర‌క్తాన్ని శుద్ధి మ‌రియు స‌మ‌తులం చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల పురుషులు య‌వ్వ‌నంగా, శ‌క్తివంతంగా ఉంటారు. అదేవిధంగా బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా పురుషులు అందం మ‌రింత పెరుగుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. బీట్ రూట్ లో నైట్రేట్ అధికంగా ఉంటుంది. బీట్ రూట్ ను తిన‌ప్పుడు ఇందులో ఉండే నైట్రేట్ నోట్లో బ్యాక్టీరియాతో క‌లిసి నైట్రేట్స్ గా మారి మెద‌డుకు రక్త ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతుంది. అందువ‌ల్ల బీట్ రూట్ ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు.

బీట్ రూట్ రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి. అలాగే పురుషుల అందానికి, ఆరోగ్యానికి ట‌మాటాలు కూడా ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శుక్ర‌క‌ణాల సంఖ్య పెరుగుతుంది. రోజూ ట‌మాటాను డైట్ లో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. పురుషులు తీసుకోవాల్సిన ఆహారాల్లో పాల‌కూర ఒక‌టి. ఆరోగ్యంపై జాగ్ర‌త్త‌గా ఉన్న‌వారు పాల‌కూర‌ను వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవాలి. పాల‌కూర‌లో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోష‌కాల‌న్నీ పురుషుల అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. అలాగే గుమ్మ‌డి కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చు.

గుమ్మ‌డి కాయ శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌న‌బ‌డుతుంది. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషులు అందంగా, య‌వ్వ‌నంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇవే కాకుండా పురుషుల అందాన్ని రెట్టింపు చేసే మ‌రికొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులు రోజుకు క‌నీసం మూడు నుండి నాలుగు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే ఫేస్ వాష్ ను మాత్ర‌మే వాడాలి. అలాగే షేవింగ్ చేసుకున్న ప్ర‌తిసారి అలొవెరా జెల్ ను చ‌ర్మానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. సాధార‌ణంగా పురుషుల చ‌ర్మం క‌ఠినంగా ఉంటుంది. క‌నుక విట‌మిన్ ఇ ఉండే క్రీముల‌ను వాడితే మంచిది. ఈ విధమైన ఆహారాల‌ను తీసుకంటూ ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల పురుషులు కూడా అందంగా క‌న‌బ‌డ‌తారు.

Share
D

Recent Posts