ముఖాన్ని శుభ్రం చేసేందుకు ఈ 6 స్టెప్స్‌ను పాటించండి.. ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది..

ముఖం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే దానిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దుమ్ము, మట్టి, ధూళి, చెమట, చనిపోయిన చర్మ కణాలు, నూనె మొదలైన వాటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మం అనారోగ్యంగా మారుతుంది. ఈ కారణాల వల్ల మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు వస్తుంటాయి. అయితే మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు ఈ 6 స్టెప్స్‌లో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ ముఖం కూడా ఆరోగ్యంగా మారుతుంది. కోల్పోయిన మెరుపు తిరిగి వస్తుంది.

follow these 6 steps to clean your face and become beautiful

స్టెప్‌ 1 – ముందుగా మీరు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని కోసం మీరు తేలికపాటి ఫేస్ వాష్‌ను ఉపయోగించవచ్చు.ఇది చర్మంపై కఠినంగా ఉండదు. ఫేస్ వాష్ లేదా క్లీన్సర్‌ని తేలికపాటిగా చేతితో ముఖం మీద రుద్దాలి. పై ముఖాన్ని నీటితో కడగాలి.

స్టెప్‌ 2 – ముఖం కడిగిన తర్వాత మీరు టోనర్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మం యొక్క pH స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. మీకు పొడి లేదా సున్నితమైన చర్మం ఉంటే హైడ్రేటింగ్ టోనర్, మొటిమలు ఉన్న వ్యక్తులు సాలిసిలిక్ యాసిడ్‌తో చేసిన టోనర్‌ని ఉపయోగించాలి.

స్టెప్‌ 3 – టోనర్ తర్వాత, విటమిన్ సి కలిగిన సీరం ముఖానికి అప్లై చేయాలి. విటమిన్ సి మీ చర్మం రంగును మెరుగుపరచడమే కాకుండా చర్మానికి పోషణను అందిస్తుంది.

స్టెప్‌ 4 – సాధారణంగా చాలా మంది కళ్ల కింది చర్మంపై దృష్టి పెట్టరు. కానీ అక్కడ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అక్కడ నల్లని వలయాలు.. డార్క్‌ సర్కిల్స్‌ ఏర్పడుతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇంటి నుండి బయలుదేరే ముందు కళ్ల కింద ఐ క్రీమ్ రాయాలి.

స్టెప్‌ 5 – ముఖం యొక్క చర్మంపై తేమ ఉండేందుకు మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి. దీనితో మీ చర్మం యొక్క సహజ తేమ పగటి సమయంలో కూడా బాగుంటుంది. దీంతో ముఖం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.

స్టెప్‌ 6 – ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడ, చేతులపై అప్లై చేయాలి. మీకు జిడ్డుగల చర్మం ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. దీంతో సూర్య కిరణాల బారి నుంచి చర్మం సురక్షితంగా ఉంటుంది.

ఈ స్టెప్స్‌ను పాటించడం వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మం మెరుస్తుంది.

Editor

Recent Posts