Hair Growth Tips : త్వరగా జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Hair Growth Tips : సాధారణంగా ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Hair Growth Tips follow these natural home remedies to grow hair

ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో ఉన్న కొల్లాజెన్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. అందువల్ల ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగాలి. అలాగే ఉసిరికపొడిని నీటిలో కలిపి జుట్టుకు బాగా పట్టించి కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రాలడం తగ్గి త్వరగా జుట్టు పెరుగుతుంది.

జుట్టు ఒత్తుగా పెరగాలనుకొనే వారికి అవిసె గింజలు ఎంతో దోహదపడతాయి. వీటిలో ఎక్కువగా ప్రోటీన్లు, ఫైబర్  ఉంటాయి. ఒక టేబుల్ టి స్పూన్ అవిసెగింజలలో సుమారుగా 6400 మిల్లీగ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని పలు అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. ఇలా అధిక మొత్తంలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్ ఉండడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రోజూ గుప్పెడు అవిసె గింజలను తింటుంటే సమస్య తగ్గుతుంది.

నిత్యం వంటలలో ఉపయోగించే కరివేపాకు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ మన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. అందువల్ల కరివేపాకును రోజూ తింటుండాలి. అలాగే కరివేపాకును పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసి కొంతసేపు అయ్యాక తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుతుంది.

Share
Sailaja N

Recent Posts