Grapes : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. ద్రాక్షతో చెక్ పెట్టండిలా..!

Grapes : ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ సరైన తిండి, నిద్ర లేకుండా కాలంతోపాటు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ద్రాక్ష చక్కని పరిష్కార మార్గమని చెప్పవచ్చు.

get rid of sleeplessness problem with grapes

తాజా పరిశోధనల ప్రకారం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ద్రాక్షలను జ్యూస్ రూపంలో లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చుని తెలియజేస్తున్నారు.

మనకు నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ద్రాక్షలలో పుష్కలంగా ఉంటుంది. కనుక పడుకోవడానికి అరగంట ముందు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎంతో హాయిగా నిద్ర పోతారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

అలాగే ద్రాక్షతోపాటు పాలకూరను కూడా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు చెర్రీ పండ్లను తినడం, గ్లాస్‌ పాలలో తేనె కలిపి తాగడం వంటివి చేసినా నిద్ర బాగా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు.

Share
Sailaja N

Recent Posts