Beard Growth : స్త్రీలే కాదు.. పురుషులు కూడా తమ అందంపై శ్రద్ధ కనబరుస్తుంటారు. కొందరికి గడ్డం బాగా పెంచుకోవాలని కోరిక ఉంటుంది. కానీ అది బాగా పెరగదు. దీంతో విచారం వ్యక్తం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాలను తినడం వల్ల పురుషులకు గడ్డం బాగా పెరుగుతుంది. తమకు కావల్సినట్లు గడ్డాన్ని పెంచుకుని దాన్ని స్టైల్‌గా మార్చుకోవచ్చు. మరి అందుకు రోజూ ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పురుషులు గడ్డం బాగా పెరగాలంటే ఎర్ర కందిపప్పును బాగా తినాలి. దీన్నే మైసూర్ లేదా మసూర్ పప్పు అంటారు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకు సహకరిస్తాయి. కనుక వీటిని తింటే పురుషులకు గడ్డం బాగా పెరుగుతుంది.
2. పాలకూరలో విటమిన్లు ఎ, సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి శిరోజాలు పెరిగేందుకు దోహదపడతాయి. కనుక పాలకూరను తరచూ తింటుంటే గడ్డం బాగా పెరుగుతుంది.
3. దాల్చినచెక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీన్ని మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క పురుషుల్లో గడ్డం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకు గాను ఏం చేయాలంటే.. కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో నిమ్మరసం పిండాలి. అనంతరం బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని గడ్డానికి రాయాలి. గంట సేపటి తరువాత కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే.. గడ్డం బాగా పెరుగుతుంది.
4. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకలు పెరిగేందుకు సహాయపడుతుంది. కనుక రోజూ గుప్పెడు గుమ్మడికాయ విత్తనాలను తింటే ఫలితం ఉంటుంది.
5. గడ్డం బాగా పెరిగేందుకు కొబ్బరినూనె కూడా ఉపయోగపడుతుంది. గడ్డంపై కొబ్బరినూనెను రాసి మర్దనా చేయాలి. గంట సేపయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే గడ్డం చిక్కగా పెరుగుతుంది. ఎలా కావాలంటే అలా స్టైల్ కూడా చేసుకోవచ్చు.