Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

Saffron For Beauty : ముఖం తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ ల‌భించే క్రీముల‌ను, వైట‌నింగ్ లోష‌న్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా, వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మం మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే ఈ క్రీములు, లోష‌న్స్ అధిక ఖ‌ర్చుతో కూడుకుని ఉంటాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ సిద్ద‌ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌న ఇంట్లోనే ఫేస్ వైట‌నింగ్ సీర‌మ్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముఖాన్ని తెల్ల‌గా మార్చే ఈ సీర‌మ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీనిని ఎలా వాడాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వైట‌నింగ్ సీర‌మ్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం చిటికెడు కుంకుమ పువ్వును, చిటికెడు ప‌సుపును, రెండు టీ స్పూన్ల గోరు వెచ్చని నీటిని, మూడు టేబుల్ స్పూన్ల‌ క‌ల‌బంద జెల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా కుంకుమ పువ్వును వీలైనంత మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో కుంకుమ పువ్వు పొడిని వేసి బాగా క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు బాగా క‌లిపిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇలా క‌లిపిన త‌రువాత దీనిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క‌ల‌బంద జెల్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ముందుగా త‌యారు చేసుకున్న కుంకుమ పువ్వు నీటిని పోసి క‌ల‌పాలి.

Saffron For Beauty know how to use it and apply
Saffron For Beauty

ఇలా త‌యారు చేసుకున్న సీర‌మ్ ను రోజూ రాత్రి ప‌డుకునే ముందు ముఖానికి రాసుకుని రెండు నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల మ‌న ముఖం తెల్ల‌గా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం తొల‌గిపోయి ముఖం కాంతివంతంగా, తెల్ల‌గా మారుతుంది. ఈ సీర‌మ్ ను ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఈ సీర‌మ్ ను త‌యారు చేయ‌డంలో వాడిన ప‌దార్థాల‌న్నీ స‌హ‌జ సిద్ద‌మైన‌వే. క‌నుక దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు.

D

Recent Posts