Betel Leaves For Sleep : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే.. క్ష‌ణాల్లో నిద్ర ప‌డుతుంది..

Betel Leaves For Sleep : మ‌న ఇండ్ల‌ల్లో జరిగే ప్ర‌తి పుణ్య‌కార్యంలోనూ ఉప‌యోగించే వాటిల్లో త‌మ‌ల‌పాకు ఒక‌టి. దేవుడి ఆరాధ‌న‌లో, దైవ‌కార్యాల్లో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. త‌మ‌ల‌పాకు లేనిదే ఏ పుణ్య‌కార్యం కూడా జ‌ర‌గ‌ద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం దైవారాధ‌న‌లోనే కాకుండా ఔష‌ధంగా కూడా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు అన్నాయ‌ని ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. త‌మ‌ల‌పాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

త‌మ‌ల‌పాకులో యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ‌రీరంలో నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో కూడా త‌మ‌లపాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌మ‌ల‌పాకును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అల‌గే ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే గుణం కూడా ఈ త‌మ‌ల‌పాకుకు ఉంది. త‌మ‌ల‌పాకును న‌మిలి తిన‌డం వ‌ల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Betel Leaves For Sleep works perfectly know how to use them
Betel Leaves For Sleep

నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. త‌మ‌ల‌పాకులో ఒక వెల్లుల్లి రెబ్బ‌ను, ఒక చిన్న అల్లం ముక్క‌ను ఉంచి తేనెతో క‌లిపి ప‌ర‌గ‌డుపున‌ మెత్త‌గా న‌మిలి తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. ఇలా 21 రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల అడ్డంకులు తొల‌గిపోయి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. త‌మ‌ల‌పాకుతో హ‌ల్వా, ల‌డ్డూ వంటి తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. త‌మ‌ల‌పాకును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌ర వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌మ‌లపాకును న‌మిలి దాన్ని ర‌సాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. అలాగే త‌మ‌ల‌పాకుకు ఆముదం రాసి వేడి చేయాలి.

దీనిని చిన్న పిల్ల‌ల క‌డుపుపై ఉంచ‌డం వ‌ల్ల గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి క‌డుపు నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ ఆకుకు ప‌సుపు రాసి పిల్ల‌ల‌కు త‌ల‌పై ఉంచ‌డం వ‌ల్ల జలుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. ల‌వంగాల‌ను, జాజికాయ‌ను, యాల‌కుల‌ను, గులాబి రేకుల‌ను, ఎండు కొబ్బ‌రిని త‌గిన మోతాదులో తీసుకుని తేనెతో క‌లిపి పాకం ప‌ట్టి హ‌ల్వా లాగా త‌యారు చేసుకోవాలి. ఈ హ‌ల్వాను త‌మ‌ల‌పాకుతో క‌లిపి తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D