Headache : ఈ నాలుగు గింజలతో తలనొప్పి దెబ్బకు పోతుంది.. ఒక్కసారి ప్రయత్నించండి..!

Headache : సాధారణంగా చాలా మందికి పలు కారణాల వల్ల తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి.. సైనస్‌ సమస్య ఉన్నవారికి.. నిద్ర సరిగ్గా పోనివారికి.. డీహైడ్రేషన్‌ బారిన పడిన వారికి.. తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చేందుకు ఏ కారణం అయినా ఉండవచ్చు. కానీ అది వచ్చిందంటే మాత్రం.. ఒక పట్టాన తగ్గదు. దీంతో ఇంగ్లిష్‌ మెడిసిన్‌ ను వాడుతుంటారు.

black pepper is wonderful remedy for Headache
Headache

అయితే తలనొప్పి వస్తే ఇంగ్లిష్‌ మెడిసిన్‌తో పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పిని సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో నాలుగు మిరియాల గింజల పొడి, సగం నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.

పైన తెలిపిన ఏ కారణం వల్ల అయినా సరే తలనొప్పి వస్తే.. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. అనవసరంగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. పైన తెలిపిన విధంగా చిట్కాను పాటిస్తే.. ఎలాంటి తలనొప్పి అయినా సరే క్షణాల్లో మటుమాయం అవుతుంది. ఈ చిట్కాను తలనొప్పి వచ్చినప్పుడల్లా ఉపయోగించవచ్చు.

Admin

Recent Posts