Aishwarya Rajinikanth : విడాకుల త‌రువాత ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ గురించి ధ‌నుష్ పోస్ట్‌.. వైర‌ల్‌..!

Aishwarya Rajinikanth : టాలీవుడ్‌లో స‌మంత, నాగ‌చైత‌న్య విడిపోయిన త‌రువాత మ‌ళ్లీ ఫ్యాన్స్‌ను అంతే షాక్‌కు గురి చేసిన విష‌యం.. ధ‌నుష్, ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్‌ల విడాకులే అని చెప్ప‌వ‌చ్చు. వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్లు గ‌త జ‌న‌వ‌రి నెల‌లో ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురిచేశారు. త‌మ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లు తెలిపారు. ఈక్ర‌మంలోనే విచారం వ్య‌క్తం చేసిన ర‌జనీకాంత్ త‌న కుమార్తెను, అల్లుడిని క‌లిపేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. కానీ వారు విడిపోవాల‌నే నిర్ణ‌యించుకున్నారు.

Aishwarya Rajinikanth and Dhanush greeted each other on social media
Aishwarya Rajinikanth

అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు తాము ఇక‌పై స్నేహితులుగా కొన‌సాగుతామ‌ని చెప్పారు. కానీ ఒక‌రికొక‌రు మాట్లాడుకున్న‌ది లేదు. నాగ‌చైత‌న్య బ‌ర్త్ డేకు స‌మంత విషెస్ కూడా చెప్ప‌లేదు. అత‌నికి సినిమాల‌కు బెస్టాఫ్ ల‌క్ కూడా చెప్ప‌లేదు. త‌న కుక్క బ‌ర్త్ డేకు ఇచ్చిన విలువ నాగ‌చైతన్య బ‌ర్త్ డేకు ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే వారి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు తారా స్థాయిలో వ‌చ్చాయ‌ని.. అందుక‌నే స‌మంత క‌నీసం విషెస్ చెప్పేందుకు కూడా అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే ధ‌నుష్, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మాత్రం ఈ విష‌యంలో ఒక మెట్టు పైనే ఉన్నార‌ని చెప్పాలి.

ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్యే ప‌య‌ని అనే మ్యూజిక్ వీడియోను తెర‌కెక్కించింది. స్వ‌యంగా తానే ఆ వీడియోకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో త‌మిళ వెర్ష‌న్‌ను త‌న తండ్రి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ విడుద‌ల చేశారు. అలాగే తెలుగు వెర్ష‌న్‌ను అల్లు అర్జున్‌, మ‌ళ‌యాళ వెర్ష‌న్‌ను మోహ‌న్ లాల్ విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ మ్యూజిక్ వీడియోపై ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మాజీ భ‌ర్త ధ‌నుష్ స్పందించారు.

ప‌య‌ని మ్యూజిక్ వీడియోపై స్పందించిన ధ‌నుష్‌.. ఆ వీడియోపై త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. కంగ్రాట్స్ మై డియ‌ర్ ఫ్రెండ్‌. నీ మ్యూజిక్ వీడియోకు బెస్టాఫ్ ల‌క్‌.. అని చెప్పారు. అయితే ధ‌నుష్ పోస్టుపై ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ కూడా స్పందించింది. థాంక్ యూ ధ‌నుష్‌.. అని రిప్లై ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే వీరి ట్వీట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విడాకుల త‌రువాత ఇద్ద‌రూ ప‌లు పార్టీల్లో ప‌రస్ప‌రం ఎదుర‌య్యారు. కానీ మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు ధ‌నుష్ స్వ‌యంగా విషెస్ చెప్ప‌డం.. అందుకు ఐశ్వ‌ర్య థాంక్స్ చెప్ప‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. విడాకుల త‌రువాత వీరు ఒక‌రిపై ఒక‌రు పెట్టిన మొద‌టి పోస్టులు కావ‌డంతో.. అవి వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ధ‌నుష్, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌ల పోస్టుల‌ను చూసిన కొంద‌రు.. స‌మంత‌, నాగ‌చైత‌న్య కూడా ఇలా క‌ల‌సి ఫ్రెండ్స్‌లా ఉండ‌వ‌చ్చు క‌దా.. అని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి వారు ముందు ముందు అయినా ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా అయినా స‌రే విషెస్ చెప్పుకుంటారా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Editor

Recent Posts