Body Detox : మీ శ‌రీరాన్ని రోజూ ఇలా క్లీన్ చేసుకోండి.. 80కి పైగా రోగాలు రాకుండా చూసుకోండి..!

Body Detox : మ‌నం ప్ర‌తిరోజూ ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను, తీపి ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటాం. అలాగే మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులను వాడుతూ ఉంటారు. ఇలా జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం, మందులు వాడ‌డం వ‌ల్ల, చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు, మ‌లినాలు, ర‌సాయనాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతాయి. ఈ విష ప‌దార్థాల‌ను మ‌న శ‌రీరం సాధ్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌ట‌కు పంపిస్తుంది. అయితే కొన్నిసార్లు మ‌న శ‌రీరం బ‌య‌ట‌కు పంపించే దాని కంటే విష ప‌దార్థాలు శ‌రీరంలో ఎక్కువైతే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

అధిక బ‌రువు, చ‌ర్మం పై మొటిమ‌లు, జుట్టు రాల‌డం, కంటి చూపు మంద‌గించ‌డం, శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, మెద‌డు ప‌నితీరు త‌గ్గ‌డం, మూత్ర‌పిండాల‌కు, కాలేయానికి సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కేవ‌లం శరీరంలో విష ప‌దార్థాలు ఎక్కువ‌వడం వ‌ల్ల త‌లెత్తుతాయి. మ‌నం తీసుకునే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను పండించ‌డానికి పురుగుమందుల‌ను, అలాగే ర‌క‌ర‌కాల ఇంజెక్ష‌న్ ల‌ను వాడుతూ ఉంటారు. దీని వల్ల ఈ ఆహారాల‌ను తీసుకున్న‌ప్పుడు ఈ పురుగుమందులు, ర‌సాయ‌నాలు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. త‌రువాత ఇవి మ‌న శ‌రీరంలో అవ‌య‌వాల‌ను దెబ్బ‌తీస్తాయి. క‌నుక ఈ ర‌సాయ‌నాలను, విష ప‌దార్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మ‌నం శ‌రీరం నుండి బ‌య‌ట‌కు పంపిస్తూ ఉండాలి. సాధార‌ణంగా చెమ‌ట‌, మ‌లం, మూత్రం ద్వారా మ‌న శ‌రీరం విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది.

Body Detox follow these home remedies for that
Body Detox

కానీ ఎక్కువ శాతం విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా మ‌న శ‌రీరంలోనే పేరుకుపోతాయి. ఇలా పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చు. శ‌రీరంలో విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించి శ‌రీరాన్ని డీటాక్స్ చేసే ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో క‌ల‌బంద జ్యూస్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో మ‌లినాలు తొల‌గిపోతాయి.

అలాగే గోధుమ‌గడ్డితో జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతాయి. దీనిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వారానికి మూడుసార్లు ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం వేగంగా శుభ్ర‌ప‌డుతుంది. చ‌ర్మంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మ‌న శ‌రీరాన్ని డీటాక్స్ చేయ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే గ్రీన్ టీ క‌వ్వాను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరం డీటాక్స్ అవుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డ‌డంతో పాటు శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొల‌గిపోతుంది.

శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అదే విధంగా రోజు మార్చి రోజు ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను నీటితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో విష ప‌దార్థాల‌ను చాలా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పంపించ‌డంలో మ‌న‌కు కొబ్బ‌రి నీళ్లు కూడా ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకుంటూనే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే నీటిని, జ్యూస్ ల‌ను ఎక్కువ‌గా తాగాలి. స‌లాడ్ ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆహార‌ప‌దార్థాల‌ను మ‌న రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. దీంతో మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము.

D

Recent Posts