Camphor For Knee Pain : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మోకాళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ సమస్యను కేవలం పెద్దవారిలో మాత్రమే చూసేవాళ్లు. కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. చాలా మంది నడవడానికి, నిలబడడానికి, వారి పనులు వారు చేసుకోవడానికి, మెట్లు ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. మోకాళ్ల నొప్పుల వల్ల కలిగే బాధా అంతా ఇంతా కాదు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అధిక బరువు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి.
అలాగే ఎక్కువ సమయం నిలబడి పని చేయడం అలాగే కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేయడంవంటి కారణాల వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఉదయాన్నే లేచి మోకాళ్లకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ ను, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. అలాగే లిఫ్ట్ ను వాడకుండా మెట్లు ఎక్కాలి. భోజనం చేసేటప్పుడు కింద కూర్చొని భోజనం చేయాలి. అలాగే ఇండియన్ టాయిలెట్ ఎక్కువగా ఉపయోగించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా వంటి వాటిని చేయాలి. జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుకోవాలి.
ఈ చిట్కాలను పాటిస్తూనే ఒక చక్కటి ఇంటి చిట్కాను వాడడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వుల నూనెలో ముద్ద కర్పూరం, కచ్చా పచ్చాగా దంచిన వామును వేసి గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందు మోకాళ్ల నుండి పిక్కల వరకు రాస్తూ మర్దనా చేసుకోవాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి జీవన విధానాన్ని పాటించడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.