చిట్కాలు

Cardamom For Beauty : యాల‌కులు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి..!

Cardamom For Beauty : మ‌న భార‌తీయుల వంట గ‌దుల్లో ఉండే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు కూడా ఒక‌టి. యాల‌కులు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. దాదాపు మ‌నం చేసే అన్ని ర‌కాల తీపి వంట‌కాలు, మ‌సాలా వంటకాల్లో ఈ యాల‌కుల‌ను వాడుతూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు మంచి వాస‌న‌ను, రుచిని తీసుకురావ‌డంలో యాల‌కులు చ‌క్క‌టి పాత్ర పోషిస్తాయి. అలాగే యాల‌కుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో ఇవి చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. అయితే మ‌న ఆరోగ్యానికే కాదు అందానికి కూడా యాల‌కులు ఎంతో మేలు చేస్తాయి. యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అంద‌మైన ముఖాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

అయితే యాల‌కులను ముఖ సౌంద‌ర్యం పెంచుకోవ‌డానికి ఎలా వాడాలి.. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 10 యాల‌కుల‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె, పాలు క‌లిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. అలాగే యాల‌కుల పొడిలో పెరుగు, శ‌న‌గ‌పిండి క‌లిపి ప్యాక్ లాగా త‌యారు చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత క‌డిగివేయాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖంపై మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. చ‌ర్మంపై ఉండే మురికి, మృత‌క‌ణాలు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా త‌యార‌వుతుంది. అలాగే యాల‌కుల నీటిని వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి అంద‌మైన ముఖాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

cardamom is also very beneficial for beauty how to use it

దీని కోసం గిన్నెలో 5 నుండి 10 యాల‌కులు వేసి నీరు పోసి ఉడ‌క‌బెట్టాలి. యాల‌కులు లేత రంగులోకి వ‌చ్చిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీళ్లు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నీటిని టోన‌ర్ గా కూడా వాడ‌వ‌చ్చు. అలాగే ఈ నీటిని వివిధ ర‌కాల ఫేస్ ప్యాక్ ల‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు. ఈ విధంగా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అంద‌మైన‌, కాంతివంత‌మైన‌, మ‌చ్చ‌లు లేని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

Admin

Recent Posts