హెల్త్ టిప్స్

Hemoglobin Foods : ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. తినాల్సిన ఆహారం ఏమిటి.. తిన‌కూడ‌నివి ఏమిటి..?

Hemoglobin Foods : మ‌న‌లో చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒక‌టి. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గ్గ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా నీరసం, బ‌ల‌హీన‌త‌, క‌ళ్లు తిర‌గ‌డం, జుట్టు రాల‌డం, వికారం, చ‌ర్మం పాలిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, గుండెద‌డ‌ వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా హిమోగ్లోబిన్ స్థాయిలు పురుషులల్లో 12.5 నుండి 18 గ్రాములు మ‌రియు స్త్రీలల్లో 11.5 నుండి 16.5 గ్రాముల వ‌ర‌కు ఉండాలి. హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డే వారు ముఖ్యంగా ఐర‌న్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ఐర‌న్ ను శ‌రీరం గ్ర‌హించాలంటే విట‌మిన్ సి చాలా అవ‌స‌రం. క‌నుక హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డే వారు ఐర‌న్ తో పాటు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి.

హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి.. అలాగే వారు తీసుకోకూడ‌ని ఆహారాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డే వారు ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. తోట‌కూర‌, గోంగూర‌, పాల‌కూర‌, బ‌చ్చ‌లికూర, మెంతికూర వంటి ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే బీట్ రూట్, ఆలుగ‌డ్డ‌, క్యాబేజి, క్యాలీప్ల‌వ‌ర్, ట‌మాట, క్యాప్సికం వంటి కూర‌గాయ‌ల‌ను తీసుకోవాలి. అదే విధంగా సోయాబీన్స్, రాజ్మా, ప‌చ్చిబ‌ఠాణీ వంటి వాటితో పాటు ప‌ల్లి చిక్కీల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే మాంసాహారంలో గుడ్లు, మాంసం, చేప‌లు వంటి వాటిని తీసుకోవాలి. ఇక ఖ‌ర్జూరాలు, ఆపిల్, దానిమ్మ‌పండ్లు, అంజీర్, బొప్పాయి వంటి వాటిని తీసుకోవాలి. అదే విధంగా గుమ్మ‌డి గింజ‌లు, అవిసె గింజ‌లు వంటి వాటిని తీసుకోవాలి. ఈ ఆహారాల‌లో ఐర‌న్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి త‌గినంత ఐర‌న్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగ‌తాయి. మ‌నం తీసుకునే ఆహారాల్లో ఉండే ఐర‌న్ ను శ‌రీరం గ్ర‌హించ‌డానికి గానూ విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి.

these hemoglobin foods take for cure of anemia

దీని కోసం కివి, లెమ‌న్, జామ‌కాయ‌లు, నారింజ‌, బ‌త్తాయి వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డే వారు టీ, కాఫీ, పాలు వంటి వాటిని త‌క్కువ‌గా తీసుకోవాలి. వీటిలో ట్యానిన్స్ ఉంటాయి. ఇవి శ‌రీరం ఐర‌న్ ను గ్ర‌హించ‌కుండా అడ్డుప‌డ‌తాయి. అలాగే ద్రాక్షపండ్ల‌ల్లో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి కూడా శ‌రీరం ఐర‌న్ ను గ్ర‌హించ‌కుండా అడ్డుప‌డ‌తాయి. అలాగే గ్లూటెన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి. ఈ విధంగా త‌గిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్ క్యాప్సుల్స్ ను వాడే అవ‌స‌రం లేకుండానే మ‌నం హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చ‌ని, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts