Coconut Oil For Hair : మనకు సులభంగా లభించే రెండు పదార్థాలను ఉపయోగించి చక్కటి హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరగకపోవడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ రకాల కారణాల చేత చాలా మంది జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి జుట్టు సమస్యలతో బాధపడే వారు చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు.
జుట్టును ఒత్తుగా పెంచే చిట్కా ఏమిటి..దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం కొబ్బరి నూనెను, మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మెంతులను జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో 2 లేదా 3 టీ స్పూన్ల మెంతి పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచిన తరువాత వడకట్టుకుని ఆ నూనెను జుట్టుకు పట్టించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించిన తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి.
తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేసిన తరువాత కండీష్ నర్ ను ఉపయోగించకపోవడమే మంచిది. ఈ విధంగా ఈచిట్కాను వారానికి రెండు సార్లు వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు ఎదుగుదలకు కావల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి. అలాగే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల్నీ తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా చక్కటి ఆరోగ్యవంతమైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.