Constipation : ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీటిని తక్కువగా తాగడం, పీచు పదార్థాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను, మసాలా కలిగిన ఆహారాలను తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత మలబద్దకం సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వల్ల గ్యాస్, కడుపులో నొప్పి, ఎసిడిటి, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మలబద్దకం సమస్య వల్ల రోజంతా చికాకుగా ఉంటుంది. దేనిపైనా దృష్టి సాధించలేకపోతాము.
ప్రేగులు శుభ్రపడకపోవడం వల్ల మలినాలు పేరుకుపోయి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ సమస్యను మనం సాధ్యమైనంత వరకు సహజ సిద్ద పద్దతిలో తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం ఒక చిన్న చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి వేడి చేయాలి. వీటిని చిన్న మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత ఆ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను, అర చెక్క నిమ్మరసాన్ని, చిటికెడు నల్ల ఉప్పును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం పరగడుపున గోరు వెచ్చగా తాగాలి. ఈ నీటిని తాగడానికి ముందు రెండు గ్లాసుల సాధారణ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా నీటిని తాగిన అరగంట తరువాత సోంపు గింజల నీటిని తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పొట్టలో పేరుకుపోయిన చెత్త అంతా తొలగిపోతుంది. పొట్ట శుభ్రం అవుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈచిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.