Corn Silk For Kidney Stones : మొక్క‌జొన్న పీచుతో ఇలా చేస్తే చాలు.. కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి..!

Corn Silk For Kidney Stones : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ర‌క్తాన్ని నిరంత‌రం వ‌డ‌పోస్తూ మ‌లినాలను బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కానీ నేటి త‌రుణంలో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ర‌క్తంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు ఎక్కువవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్స‌లేట్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్ వంటివి ఉంటాయి. ఎప్పుడేతే మూత్రంలో ఈ పోష‌కాల శాతం ఎక్కువ‌వుతుందో అవి మూత్ర‌పిండాల్లో కొద్ది కొద్దిగా పేరుకుపోయి చిన్న చిన్న రాళ్ల లాగా ఏర్ప‌డుతాయి. ఈ రాళ్లు క్ర‌మంగా పెద్ద‌వి అయ్యి తీవ్ర‌మైన నొప్పికి దారి తీస్తాయి.

మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా మూత్రాశ‌యం, మూత్ర‌నాళాలు కూడా దెబ్బ‌తింటాయి. మూత్రంలో క్యాల్షియం, ఆక్స‌లేట్ శాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌లే 80 శాతం మూత్ర‌పిండాల్లో రాళ్లు వ‌స్తూ ఉంటాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క్యాల్షియం, ఆక్స‌లేట్స్ ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవాలి. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నా కూడా మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. క‌నుక యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలి. మూత్ర‌పిండాల్లో రాళ్ల ప‌రిమాణం పెరిగే కొద్ది నొప్పి, బాధ ఎక్కువ‌వ‌డంతో పాటు వీటిని తొల‌గించ‌డానికి శ‌స్త్ర‌చికిత్స చేయాల్సి ఉంటుంది. క‌నుక స‌మ‌స్య ప్రారంభ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Corn Silk For Kidney Stones how to use it for effective results
Corn Silk For Kidney Stones

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ను త‌గ్గించే చిట్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను తొల‌గించ‌డంలో మొక్క‌జొన్న పీచు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మొక్క‌జొన్న పీచుతో టీ ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ముందుగా ఒక గిన్నెలో 4 క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక మొక్క‌జొన్న పీచును వేసి నీళ్లు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌కట్టి క‌ప్పులోకి తీసుకోవాలి. త‌రువాత వీటిలో ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రెండు పూట‌లా భోజ‌నం చేసిన 40 నిమిషాల త‌రువాత తీసుకోవాలి.

క్ర‌మం త‌ప్ప‌కుండా వారం రోజుల పాటు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను తొల‌గించ‌డంలో ముల్లంగి విత్త‌నాలు కూడా ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ముల్లంగి విత్త‌నాల‌తో క‌షాయాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో 2 టీ స్పూన్ల ముల్లంగి విత్త‌నాల‌ను వేసి నీరు స‌గం అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో 2 నిమ్మ‌కాయ‌ల ర‌సాన్ని క‌ల‌పాలి. ఇలా రోజుకు రెండు పూట‌లా తీసుకోవాలి. ఇలా మూడు రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల 50 శాతం స‌మ‌స్య ఇట్టే న‌యం అవుతుంది.

అలాగే ర‌ణ‌పాల చెట్టు ఆకుల‌ను నేరుగా తిన‌డం లేదా వాటిని పేస్ట్ లా చేసి తీసుకోవ‌డం లేదా ఆ ఆకుల‌తో జ్యూస్ చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డంతో పాటు నీటిని ఎక్కువ‌గా తాగ‌డం చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

D

Recent Posts