Cracked Heels Remedy : మనలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. చాలా మందికి ముఖం అందంగా ఉన్నప్పటికి పాదాలు మాత్రం పగిలి అందవిహీనంగా ఉంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడడానికి వివిధ కారణాలు ఉంటాయి. పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పాదాలపై మృత కణాలు పేరుకుపోవడం, శరీరం డీ హైడ్రేషన్ కు గురి కావడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, ఊబకాయం, షుగర్, హైపో థైరాయిడిజం, ఎత్తుగా ఉండే చెప్పులను ధరించడం, పాదాల దగ్గర చర్మం పొడిబారడం వంటి వివిధ కారణాల చేత పాదాల పగుళ్లు ఏర్పడతాయి. పాదాల పగుళ్ల కారణంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా చాలా మంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పగుళ్లు తీవ్రమై పగుళ్ల నుండి రక్తం కారే అవకాశం కూడా ఉంటుంది.
కనుక సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే పాదాల పగుళ్లను మనం నివారించుకోవాలి. ఒక చక్కటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను క్రమం తప్పకుండా వాడడం వల్ల మనం పాదాల పగుళ్లను చాలా సులభంగా నివారించుకోవచ్చు. పాదాల పగుళ్లను తగ్గించే ఆ చిట్కా ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక క్యాండిల్ ను, రెండు టీ స్పూన్ల ఆవ నూనెను, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక క్యాండిల్ ను తీసుకుని రెండు ఇంచుల పరిమాణంలో కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆందులో ఆవనూనెను, విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసుకోవాలి.
తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి క్యాండిల్ కరిగే వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత పాదాల పగుళ్లపై రాసుకోవాలి. దీనిని రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. అయితే ఈ చిట్కాను వాడే ముందు పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పాదాలపై ఉండే మురికి, మృతకణాలు పోయేలా శుభ్రం చేసుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఇలా ఈ చిట్కాను క్రమం తప్పకుండా వాడడం వల్ల చాలా సులభంగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లతో ఇబ్బంది పడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.