చిట్కాలు

Cracked Heels : చ‌లికాలంలో మ‌డ‌మ‌లు ప‌గిలి ఇబ్బందులు ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Cracked Heels : చలికాలంలో చర్మం బాగా పాడైపోతుంది. చలికాలంలో పగుళ్లు వంటి వాటి వలన కూడా, ప్రతి ఒక్కరు సతమతమవుతుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మొదలవుతాయి. ఎక్కువమంది మడమల పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని వలన, రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతుంటారు. పాదాల రంగు కూడా, పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అయితే, చలిలోకి కూడా రాలేకపోతుంటారు. పగుళ్ల సమస్యని ఎదుర్కోవాలంటే, కొన్ని చిట్కాలని పాటించాలి.

ఇలా చేస్తే, పాదాలు మృదువుగా మారతాయి. అందంగా మారతాయి. మరి, ఈ సమస్య నుండి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం. చలికాలంలో పాదాలు క్లీన్ గా ఉండాలి అంటే, స్నానం చేసేటప్పుడు లేదంటే ఖాళీ దొరికినప్పుడు, పాదాల మీద శ్రద్ధ పెట్టాలి. కాళ్లు పగిలినట్లయితే, నూనె వంటివి ఏమైనా మీరు రాసుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కలబంద గుజ్జుని, గ్లిజరిన్ ని రాసి కొద్దిసేపు మర్ధన చేయాలి. దీంతో మీకు రిలీఫ్ కలుగుతుంది. నిద్ర కూడా పట్టేస్తుంది. ప్రతిరోజు ఇలా చేస్తే, పగుళ్లు పూర్తిగా మాయమైపోతాయి.

cracked heels wonderful home remedies

ఒకవేళ కనుక పగిలిన మడమల బాధనుండి బయటపడాలని అనుకుంటే, దానిమీద కొంచెం తేనె రాయండి. పాదాలు మృదువుగా మారుతాయి. అందంగా కనబడతాయి. ప్రతిరోజు రాత్రి, పాదాలకి తేనెను రాసి, కొంచెం సేపు మర్దన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె కూడా ఈ సమస్య నుండి మనల్ని బయటపడేస్తుంది. కొబ్బరి నూనె శరీరానికి, ముఖానికి బాగా ఉపయోగపడుతుంది.

పగిలిన మడమల మీద, కొబ్బరి నూనె రాసి, మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. బియ్యం పిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండి తీసుకొని, మీరు పగిలిన మడమల మీద స్క్రబ్ చేయాలి. ప్రతిరోజు చేస్తే పగుళ్ళు మాయమైపోతాయి. పాదాల పగుళ్ళతో బాధపడే వాళ్ళు, ఈ చిన్న చిట్కాలని ఫాలో అయితే, చక్కటి ఫలితం ఉంటుంది. ఈజీగా మీ పాదాలని మృదువుగా మార్చుకోవచ్చు. పగుళ్ల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.

Admin

Recent Posts