Curry Leaves For Cholesterol : కొలెస్ట్రాల్ సమస్య అనేది నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. సరైన జీవన విధానం పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి గుండె పోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ బారిన పడతారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే మనం కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను అనేక ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకును రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయని, రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుందని, రక్తనాళాలు క్లీన్ చేసినట్లు మారుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరివేపాకులను 8 నుంచి 10 తీసుకుని రోజూ మనం వాడే వంటల్లో వేసి ఉడికించి తినాలి. లేదా నేరుగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఉదయం పరగడుపునే 5 కరివేపాకులను తీసుకుని బాగా కడిగి వాటిని అలాగే నమిలి మింగాలి. లేదంటే వాటి నుంచి రసం తీసి కూడా తాగవచ్చు. ఎలా తీసుకున్నా కరివేపాకుల వల్ల మనకు అనేక లాభాలే కలుగుతాయి. కరివేపాకులను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పూర్తిగా తగ్గుతాయి. రక్తనాళాలు కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా కరివేపాకుల వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
కరివేపాకులను తినడం వల్ల కేవలం కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడం మాత్రమే కాదు, వీటిని రోజూ తింటుంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా గ్యాస్ తగ్గుతుంది. కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే కరివేపాకుల్లో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత ఉండదు. ముఖ్యంగా ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు మనకు కొత్తిమీర కూడా బాగానే ఉపయోగపడుతుంది. వీటిని కూడా రోజూ ఉదయం పరగడుపునే తినాలి. లేదా జ్యూస్ తాగవచ్చు. అలాగే నేరేడు ఆకులు, విత్తనాలు, నేరేడు పండ్ల జ్యూస్, తులసి ఆకులు.. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.