చిట్కాలు

Fenugreek Seeds For Hair : మెంతుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Fenugreek Seeds For Hair : మెంతులు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మెంతులని తీసుకోవడం వలన, చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మెంతులతో జుట్టు సమస్యలకి కూడా చెక్ పెట్టవచ్చు. ఈరోజుల్లో చాలామంది, జుట్టు విపరీతంగా రాలుతుంది. వయసుతో సంబంధం లేకుండా, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు, చాలా మందిలో ఉంటున్నాయి. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కలిగితే, చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

హెయిర్ ప్యాక్ లు, ఖరీదైన ఆయిల్స్, షాంపూలు వంటి వాటికి బదులుగా, ఇంటి చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. చిట్లిపోవడం, చుండ్రు ఇలాంటి బాధలు ఏమీ కూడా ఉండవు. ఇక మెంతులు విషయానికే వస్తే.. మెంతులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఫాలిక్ యాసిడ్, కాల్షియంతో పాటుగా ఐరన్, పొటాషియం, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. శిరోజాలని ఆరోగ్యంగా ఉంచడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతులతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.

do like this with fenugreek seeds for hair growth

కుదుళ్ళకి మెంతులు పోషణని ఇస్తాయి. తలకి రక్తప్రసరణ పెరిగేటట్టు, మెంతులు చేస్తాయి. మెంతులు పొడవాటి జుట్టు పెరిగేందుకు, చాలా బాగా హెల్ప్ అవుతాయి. మెంతి గింజలలో హార్మోన్ రెగ్యులేటింగ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. హార్మోన్స్ అసమతుల్యత కారణంగా, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన చుండ్రు కూడా తగ్గుతుంది.

దురద వంటివి కూడా పోతాయి. మెంతి గింజల్ని రాత్రి నానబెట్టి, ఉదయాన్నే రుబ్బుకుని కొబ్బరి నూనె కానీ పుల్లని పెరుగు కానీ వేసి, జుట్టుకి బాగా పట్టించాలి. గంట తర్వాత షాంపూ తో కడిగేసుకుంటే, సరిపోతుంది. ఇలా చేయడం వలన జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. చుండ్రు సమస్యకి కూడా చెక్ పెట్టవచ్చు. అందమైన పొడవాటి కురులని సొంతం చేసుకోవచ్చు.

Admin

Recent Posts