Facial Hair Home Remedies : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం, అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తారు. చాలామంది ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అలానే, కొందరైతే మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎక్కువమంది మహిళలు ఎదుర్కునే సమస్య ఫేషియల్ హెయిర్. ఫెషల్ హెయిర్ సమస్య ఉన్నట్లయితే, పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలానే, ఖరీదైన క్రీమ్స్ ని కూడా వాడుతుంటారు. అయితే, ఫేషియల్ హెయిర్ సమస్య నుండి బయట పడాలంటే, ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి.
ఈజీగా ఫేషియల్ హెయిర్ సమస్య నుండి, బయటపడవచ్చు. మరి ఇక దీనిని ఎలా పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాము. ఫేషియల్ హెయిర్ తో మీరు కూడా బాధపడుతున్నట్లయితే, ఈ విధంగా చేయండి. ఈజీగా సమస్య నుండి బయట పడిపోవచ్చు. ఈ సమస్య నుండి బయట పడాలంటే, ఈ చిన్న చిట్కాని ట్రై చేస్తే సరిపోతుంది. దీనికోసం కొద్దిగా పట్టిక బెల్లం తీసుకోండి. ఇది మనకి ఈజీగా దొరుకుతుంది.
పటిక బెల్లం పౌడర్ కింద మీరు గ్రైండ్ చేసుకోండి. ఒక చిన్న కడాయి తీసుకుని, అందులో పచ్చిపాలని వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పటిక బెల్లం పొడిని వేసి మిక్స్ చేయండి. బాగా కలపండి. ఈ పౌడర్ అంతా కూడా పాలలో కలిసిపోవాలి. కాబట్టి ఒకసారి కలపండి. అర టీ స్పూన్ పసుపు వేసుకుని, అలానే కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసుకోండి. ఒక స్పూన్ వరకు సరిపోతుంది నూనె.
ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలపండి. స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. రెండు స్పూన్ల వరకు గోధుమపిండి వేసుకోవాలి. కాఫీ పొడి కూడా వేసి, బాగా మిక్స్ చేసి, ఫేషియల్ హెయిర్ పైన రాయండి. కొంచెం ఆరిన తర్వాత, దానిని రిమూవ్ చేయండి. కొంచెం స్కిన్ ని ప్రెస్ చేస్తూ తీసేయండి. ఫేషియల్ హెయిర్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా ఫేషియల్ హెయిర్ ని తొలగించుకోవచ్చు.