చిట్కాలు

Fenugreek Ajwain Black Cumin : మ‌న‌కు వ‌చ్చే 80 శాతం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు స‌ర్వ‌రోగ నివారిణి ఇది..!

Fenugreek Ajwain Black Cumin : ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. ఇంట్లోనే మీరు స్వయంగా దీనిని తయారు చేసుకోవచ్చు. సులభంగా ఏ సమస్యనుండైనా కూడా బయటపడొచ్చు. 250 గ్రాముల‌ మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల‌ నల్ల జీలకర్రను సర్వరోగ నివారిణి చేసుకోవడానికి తీసుకోవాలి. ఇక ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా మూడు పదార్థాలని రాళ్లు, మట్టి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి.

వేరువేరుగా వీటిని కొంచెం కొంచెం వేసి వేడి చేస్తూ ఉండాలి. వీటన్నింటినీ వేయించుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మూడు కలిపి పొడి చేసుకోవాలి. గాలి వెళ్లడానికి వీలు లేని సీసాలో మీరు ఈ పొడిని వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిని తీసుకుంటే అనేక రకాల సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. ఇక ఈ పొడిని ఎలా ఉపయోగించాలి అనేది కూడా చూసేద్దాం.

Fenugreek Ajwain Black Cumin works like sarva roga nivarini

రోజు రాత్రి భోజనం చేశాక కొంచెం సేపు ఆగి తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూన్ చూర్ణం వేసుకోవాలి. దీన్ని బాగా క‌లిపి తాగాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలని కూడా తీసుకోకూడదు. రోజూ ఈ పొడిని తీసుకుని తాగితే విష పదార్దాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటికి వచ్చేస్తాయి. మీరు 40 నుండి 50 రోజులు పాటు క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వలన చక్కటి ఫలితం మీకు కనపడుతుంది.

మూడు నెలలు కనుక దీనిని మీరు ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. శరీరంలో అదనపు కొవ్వు బయటకు వచ్చేస్తుంది. రక్తం శుభ్రంగా మారుతుంది. శరీరంలో మంచి రక్తం వస్తుంది. శరీరం బలంగా, చురుగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ముడతలు కూడా పోతాయి. శరీరంలో యవ్వనత్వం వస్తుంది. ఇలా సులభంగా ఈ పొడితో చక్కటి లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts