Fenugreek Seeds For Hair : నెల రోజుల్లోనే జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెర‌గాలా.. అయితే ఇలా చేయండి చాలు..!

Fenugreek Seeds For Hair : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. అవును.. మీరు విన్న‌దే నిజ‌మే. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం, త‌ల‌లో దుర‌ద‌ వంటి జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఉప‌యోగించే ప‌దార్థాల‌న్నీ కూడా స‌హ‌జ సిద్ద‌మే. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నకు ఎక్కువ‌గా ఖ‌ర్చు కూడా అవ్వ‌దు. అలాగే ఈ ప‌దార్థాల‌న్నీ కూడా విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు.

ఈ చిట్కాను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు అలాగే సుల‌భంగా వాడ‌వ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరిగేలా చేసే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ప్ర‌ధానంగా మెంతుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. అలాగే పెరుగును, బాదం నూనెను, విట‌మిన్ ఇ క్యాప్పుల్స్ ను , క‌ల‌బంద గుజ్జును కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా మ‌న జుట్టుకు స‌రిపోయేట‌న్నీ మెంతుల‌ను తీసుకుని నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ మెంతుల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, 2 విట‌మిన్ ఇ క్యాప్సుల్స్, ఒక టేబుల్ స్పూన్ క‌ల‌బంద‌ గుజ్జును వేసి క‌ల‌పాలి.

Fenugreek Seeds For Hair wonderful remedy that works
Fenugreek Seeds For Hair

ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల మ‌నం జుట్టు రాల‌డాన్ని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్ల ధృడంగా త‌యార‌వ్వ‌డానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది. పెర‌గ‌డం ఆగిన జుట్టు కూడా పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు అందంగా, ఒత్తుగా, మృదువుగా, ప‌ట్టుకుచ్చులా త‌యార‌వుతుంది.

D

Recent Posts