సమయానికి భోజనం చేయకపోవడం, చాలా త్వరగా తినడం, అజీర్ణం, కడుపులో మంట, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తినడం.. వంటి ఎన్నో కారణాల వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. దీంతో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. జీర్ణాశయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన పలు ఇంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్ ధనియాలను తీసుకుని వాటిని అలాగే నమిలి తినాలి. లేదా ధనియాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
2. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, అల్లం రసం కలిపి తాగడం వల్ల కూడా గ్యాస్ తగ్గుతుంది.
3. భోజనం చేసిన తరువాత చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని నిమ్మరసంలో ముంచి తినాలి. గ్యాస్ తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా వాము పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి కలిపి తీసుకోవాలి. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
5. భోజనం చేసిన అనంతరం తులసి ఆకులను నమిలి తినాలి. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365