కూర‌గాయ‌లు

అన్ని విటమిన్లు, మినరల్స్‌కు నిలయం తోటకూర.. పోషకాల గని.. తరచూ తినడం మరువకండి..!

తోటకూర మనకు మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీన్ని కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ తోట కూరలో పోషక విలువలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తోటకూరను తరచూ తింటుండాలి. దీన్ని తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of thotakura

1. బరువు తగ్గాలనుకునేవారు తరచూ తోటకూరను తింటుండాలి. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది.

2. తక్షణశక్తికి తోటకూర ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వేపుడు కన్న కూరగా లేదా పప్పుతో కలిపి వండుకుని తింటే మంచిది. దీంతో శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి.

3. హైబీపీ ఉన్నవారు తోటకూరను తరచూ తింటే మంచిది. బీపీ నియంత్రణలో ఉంటుంది.

4. తోటకూరలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే వ్యాధులను తగ్గించుకోవచ్చు.

5. తోటకూరను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి దాన్ని తలకు బాగా పట్టించాలి. తరువాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు తగ్గుతాయి.

6. తోటకూరలో కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. దీని వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండెకు మేలు జరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

7. తోటకూరను విటమిన్లకు గని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె, బి12, బి6 వంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకే కూరలో ఉండడం మనకు ఎంతో మేలు చేసే విషయం. అన్ని విటమిన్లకు భిన్న పదార్థాలను తినాల్సిన పనిలేదు. ఒక్క తోటకూరను తింటే చాలు, అన్ని విటమిన్లు లభిస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts