Armpits Darkness : శరీరంలో ఏ భాగంలో అయినా సరే నల్లని మచ్చలు ఉంటే ఎవరికీ నచ్చదు. ముఖ్యంగా చంకల్లో కొందరికి పలు కారణాల వల్ల నల్లగా మారుతుంటుంది. అలాంటి వారు నలుగురిలో స్లీవ్‌లెస్‌లో కనిపించలేరు. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల చంకల్లో ఉండే నలుపుదనం పోతుంది. చంకలు తెల్లగా మారి అందంగా కనిపిస్తాయి. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. చంకల్లో ఉండే నలుపుదనాన్ని పోగొట్టేందుకు బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని చంకల్లో రాయాలి. గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. తగ్గే వరకు ఈ చిట్కాను పాటించాలి. దీంతో చంకల్లోని నలుపుదనం పోయి చంకలు అందంగా మారుతాయి.
2. కొబ్బరినూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇది చర్మంపై ఉండే మచ్చలను, మురికిని పోగొడుతుంది. రాత్రి పూట కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని చంకల్లో రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వారం రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. తరువాత నలుపుదనం తగ్గేవరకు ఈ చిట్కాను పాటించవచ్చు.
3. చంకల్లోని నలుపుదనాన్ని పోగొట్టేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లో అంతే మోతాదులో బేకింగ్ సోడాను కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని చంకల్లో రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కాను వారంలో మూడు సార్లు పాటిస్తే చాలు, చంకల్లోని నలుపుదనం పోతుంది.
4. చంకల్లోని నలుపుదనాన్ని తగ్గించడంలో ఆలివ్ నూనె కూడా బాగానే పనిచేస్తుంది. కొబ్బరినూనె లాగే దీన్ని కూడా రాత్రి పూట ఉపయోగించాలి. మరుసటి రోజు కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది.
5. నిమ్మరసం మన చర్మాన్ని సంరక్షిస్తుంది. మొటిమలు, మచ్చలను పోగొడుతుంది. ఒక నిమ్మకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి చంకల్లో రుద్దాలి. గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే.. చంకల్లోని నలుపుదనం తగ్గిపోతుంది.
6. నిమ్మరసం లాగే ఆలుగడ్డల జ్యూస్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని కూడా చంకల్లో రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. దీన్ని 2 రోజులకు ఒకసారి పాటించవచ్చు. దీంతో మంచి ఫలితాలు వస్తాయి.
7. చంకల్లో కలబంద గుజ్జును రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.
8. బియ్యం పిండిలో కొద్దిగా వెనిగర్ కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని చంకల్లో రాయాలి. 20 నిమిషాలు ఆగి కడిగేయాలి. దీన్ని వారంలో మూడు సార్లు పాటించవచ్చు.
9. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి రాస్తున్నా చంకల్లో నలుపుదనం తగ్గిపోతుంది. దీన్ని కూడా రోజూ పాటించవచ్చు.