Viral Video : వామ్మో.. స‌ల స‌ల కాగుతున్న వేడి వేడి నూనెలో చేతుల‌ను పెడుతూ ప‌కోడీలు వేస్తున్న వ్య‌క్తి..!

Viral Video : స‌ల‌స‌ల కాగుతున్న వేడి వేడి నూనెలో చేతులు పెడితే ఏం జ‌రుగుతుంది ? అస‌లు ఎవ‌రైనా అలాంటి నూనెలో చేతులు పెడ‌తారా ? స‌వాలే లేదు. అస‌లు అలాంటి సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. తెలిసి తెలిసీ చేతుల‌ను ఎవ‌రూ కాల్చుకోరు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం అలాంటి నూనెలో చేతుల‌ను పెడుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నికి ఏమీ కావ‌డం లేదు. ఏంటీ.. న‌మ్మ‌లేరా.. అయితే కింద ఇచ్చిన వీడియోను మీరే చూడండి.

Viral Video man put his hand in boiling oil and making pakodas

జైపూర్‌లో ఓ చిరువ్యాపారి రోడ్డు ప‌క్క‌న త‌న బండిపై నూనెలో వేడి వేడిగా ప‌కోడీల‌ను వేసి ఇస్తున్నాడు చూశారు క‌దా. వాటిని చూస్తుంటేనే నోరూరిపోతోంది. అయితే అత‌ను ఆ స‌ల స‌ల కాగే వేడి వేడి నూనెలో త‌న చేతుల‌ను పెడుతున్నాడు. అనంత‌రం చేతుల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ అత‌ని చేతుల‌కు ఏమీ కావ‌డం లేదు. చూశారు క‌దా. న‌మ్మ‌లేక‌పోయినా ఇది నిజ‌మే.

ఆ వ్య‌క్తి అక్క‌డ కిసాన్ ప‌కోడే వాలా పేరిట ప‌కోడీల‌ను చేసి విక్ర‌యిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఓ ఫుడ్ బ్లాగ‌ర్ అత‌న్ని వీడియో తీసి ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది. చాలా మంది అత‌ను అలా నూనెలో చేతులు పెడుతుండ‌డాన్ని షాకింగ్‌గా చూస్తున్నారు. వేడి వేడి నూనెలో చేతులు పెట్టినా ఏమీ కాక‌పోవ‌డంతో.. నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వీడియోను ఇప్ప‌టికే ఎంతో మంది వీక్షించారు. 74వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. దీనిపై చాలా మంది ర‌క ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. చేతుల‌ను శుభ్రం చేసుకుని నూనెలో పెడితే బాగుంటుంది.. అని కొంద‌రు కామెంట్ చేస్తుండ‌గా.. ఆ ప‌కోడీల‌ను తినాల‌ని ఉందంటూ.. మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Share
Editor

Recent Posts