Cough And Cold : ద‌గ్గు, జ‌లుబు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా ? ఈ చిట్కాల‌ను పాటిస్తే వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

Cough And Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఎవ‌ర్న‌యినా స‌రే.. ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. ద‌గ్గు, జ‌లుబు నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these natural home remedies for Cough And Cold

1. ద‌గ్గు, జలుబు ఉన్న‌వారు ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. రోజుకు 3 సార్లు ఇలా తీసుకుంటే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తేనె, మిరియాల్లో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు తగ్గుతాయి.

2. కేవ‌లం ద‌గ్గు స‌మ‌స్య మాత్ర‌మే ఉన్న‌వారు పైనాపిల్ పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. పైనాపిల్ పండ్ల‌లో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ద‌గ్గును త‌గ్గిస్తుంది. గొంతులో క‌ఫాన్ని బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో ద‌గ్గు నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. ఉద‌యాన్నే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటున్నా ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను 2 తీసుకుని దంచి ఒక టీస్పూన్ తేనెతో క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ద‌గ్గు, జ‌లుబును వేగంగా త‌గ్గిస్తాయి.

4. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. పాల‌లో ప‌సుపు క‌లుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీని వ‌ల్ల కూడా శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌సుపులో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

5. వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనే కాదు, ద‌గ్గు, జ‌లుబును తగ్గించ‌డంలోనూ అల్లం బాగా ప‌నిచేస్తుంది. పూట‌కు ఒక టీస్పూన్ చొప్పున అల్లం ర‌సాన్ని రోజుకు 3 సార్లు సేవించాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts