Tulasi Tea : తులసిని వైద్యంలో భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
తులసి ఆకుల్లో విటమిన్లు ఎ, సి, కెలతోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
1. తులసి ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకుల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. రోజూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు తులసి ఆకులతో తయారు చేసే టీని తాగాలి. దీంతో ఒత్తిడి మటుమాయం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
3. జ్వరం బాగా ఉన్నవారు రోజుకు 3 సార్లు తులసి ఆకులతో తయారు చేసిన టీ ని తాగాలి. దీంతో జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి.
4. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం తులసి ఆకుల టీని తాగాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
5. తులసి ఆకుల టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వాంతులు, వికారం సమస్యల నుంచి బయట పడవచ్చు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో పైన చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.