Hair Growth : జుట్టు పొడ‌వుగా పెర‌గాలంటే.. అద్భుత‌మైన వంటింటి చిట్కా..

Hair Growth : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మ‌నంద‌రిన్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు రాల‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. చిన్న వ‌య‌సులోనే జుట్టు ఊడ‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంక‌పోవ‌డం, కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి ఇలా అనేక కార‌ణాల‌తో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్నీ ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. అయినా కానీ ఎటువంటి ఫ‌లితం లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ జుట్టు రాల‌డాన్ని ఒక చిట్కాను ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ జుట్టు రాల‌డాన్ని మ‌నం టీ పొడి ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంతో పాటు జుట్టును నల్ల‌గా, ఒత్తుగా, కాంతివంతంగా త‌యారు చేస్తుంది. టీ శ‌రీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వ‌డ‌మే కాదు జుట్టు పెరుగుద‌ల‌కు కూడా స‌హాయ‌ప‌డుతుంది. కాఫీతో పోలిస్తే టీ లో కెఫిన్ అనే ప‌దార్థం అధికంగా ఉంటుంది. జుట్టుకు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌ను టీ పొడితో తగ్గించుకోవ‌చ్చు. జుట్టు కుదుళ్ల‌కు కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించి జుట్టును బ‌లంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్య‌వంతంగా బ‌లంగా ఉండేలా చేస్తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడాయ్య‌క 2 టీ స్పూన్ల టీ పొడిని వేసి బాగా మ‌రిగించాలి.

follow these remedies for hair growth and hair problems
Hair Growth

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీరు చ‌ల్లారిన త‌రువాత జుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది. త‌రువాత ష‌వ‌ర్ క్యాప్ తో లేదా ట‌వ‌ల్ తో జుట్టును ద‌గ్గ‌రికి ముడి వేసి ఉంచాలి. ఒక గంట త‌రువాత జుట్టును గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేయాలి. త‌ల‌స్నానం చేసే ప్ర‌తిసారి ఈ చిట్కాను పాటించడం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది. జుట్టు నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంది.

Share
D

Recent Posts