Knee Pain : కీళ్ల నొప్పులతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. పూర్వకాలంలో పెద్దవారిలోనే కనిపించే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో నడివయస్కుల్లో కూడా మనం చూడవచ్చు. కారణాలేవైనప్పటికీ ఈ సమస్య బారిన పడిన వారి బాధ వర్ణాతీతంగా ఉంటుంది. వారి పనులను కూడా వారు చేసుకోలేకపోతుంటారు. ఈ కీళ్ల నొప్పులను మనం కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నయం చేసుకోవచ్చు.
కీళ్ల నొప్పులను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. నొప్పులు ఉన్న చోట ఆలివ్ నూనెను రాసి చర్మంలోకి నూనె ఇంకేలా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో వేడి నీరు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వేడి నీటిని ఒక పెద్ద పాత్రలో పోసి అందులో నొప్పులుగా ఉన్న చేతులను, కాళ్లను ఉంచడం వల్ల వెంటనే నొప్పులు తగ్గుతాయి.
అదే విధంగా కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని తాజాగా నిపుణులు కనుగొన్నారు. వేడి నీటితో కలిపి ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి వాటితో బాధపడే వారికి ఐస్ థెరపీ చక్కటి వరం లాంటిదని చెప్పవచ్చు. నొప్పులు ఉన్న చోట ఐస్ ప్యాక్ ను ఉంచి సున్నితంగా మర్దనా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఇక కీళ్ల నొప్పులను తగ్గించడంలో పసుపు కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. కానీ దీనిలో ఎవరికి తెలియని మరో గుణం కూడా ఉంది.
కీళ్ల నొప్పులను తగ్గించే గుణాన్ని కూడా పసుపు కలిగి ఉంటుంది. పసుపు నీటితో కలిపి పేస్ట్ గా చేసుకుని నొప్పులు ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నీటిలో లేదా పాలలో పసుపును కలిపి తీసుకున్నా కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.