చిట్కాలు

మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

మీ చర్మం రంగు మెరిసిపోవాలంటే మీ చేతుల్లోనే వుంది. పార్లర్ లకుపోయి సొమ్ము పోయాల్సిన అవసరం కూడా లేదు. చర్మ పోషణకవసరమైన కొన్ని ప్రధానమైన పానీయాలు పరిశీలించండి. కోకో – ఈ గింజలలో ఎండ నుండి చర్మాన్ని రక్షించే ఫ్లేవనాల్స్ అధికంగా వుంటాయి. ఉదయం, సాయంత్రం తాగటమే కాక, స్నానపు నీటిలో కోకో పౌడర్ (కప్పులో ఎనిమిదో భాగం) కొవ్వు లేని పాలు(కప్పులో 3 వంతులు) స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి.

పెరుగు – పెరుగులో వుండే పోషకాలు మీ చర్మం లేతగా వుండేలా చేస్తాయి. ముఖానికి బాగా పట్టించి కొద్ది నిమిషాలుంచి కడిగేయండి. కాంతులీనే ముఖం మీ సొంతమవుతుంది. స్ట్రా బెర్రీలు – వీటిలో వుండే విటమిన్ సి ఎండనుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. బెర్రీ లను బాగా నలిపి చల్లటి పెరుగులో కలిపి దానికి అర చెంచా నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించండి. మొటిమలు, నల్లని మచ్చలు కూడా పోతాయి. చర్మం మంచి నిగారింపు పొందుతుంది.

follow these wonderful health tips for beauty

గ్రీన్ టీ – దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని బయటి వాతావరణం నుండి సంరక్షించి మంచి రంగు కలిగేలా చేస్తాయి. కాఫీ – రోజూ ఒక కప్పు కాఫీ తాగితే చర్మం ముడతలు పడకుండా, వేలాడకుండా వుంటుంది. ఎండకు చర్మం రంగు మారకుండా కాపాడుతుంది. ఒక కప్పు మాత్రమే తాగాలి సుమా!

Admin

Recent Posts