వినోదం

ఎన్టీఆర్, మనోజ్ ల గురించి మనం గమనించని కొన్ని సిమిలారిటీస్..!!

ఈ సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఉంటారనేది నిజమే కానీ సినిమాలలో చూపించినట్లు ఒకేలా, ఒకే ఎత్తులో, ఒకే రంగులో ఉండరు. అంతేగాక ఒకరిని పోలిన వారు ఇంకొకరు ఉండొచ్చేమో గాని ఏడుగురు అనేదానికి ఎటువంటి ప్రామాణికత లేదు. అనుకోకుండా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను ఫలానా వాడిలా ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతాం. కవలల్లో అటువంటి పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒకరికి ఒకరు సంబంధం లేని వారిలో పోలికలు తక్కువ. ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు యంగ్ హీరోలకి కూడా ఒకే రకమైన ఐదు పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు ఏంటి? ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ జీవితాలలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళు నిజ జీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1983 వ సంవత్సరం మే 20వ తేదీన వీరిద్దరూ జన్మించారు. కానీ ఎన్టీఆర్ మనోజ్ కంటే కొన్ని గంటల ముందు జన్మించారు. ఇక బాల నటుడిగా ఇద్దరు ఎంట్రీ ఇచ్చింది కూడా రామారావు సినిమాల్లోనే కావడం గమనార్హం. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర ద్వారా బాలా నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్ సినిమాతో బాలన‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

we can see these similarities in jr ntr and manchu manoj

ఇక ఈ ఇద్దరు హీరోల తండ్రులు కూడా రాజ్యసభ ఎంపీలు కావడం గమనార్హం. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇద్దరూ ఎంపీలుగా రాజ్యసభలో అడుగుపెట్టిన వారే. వీరిద్దరి భార్యల పేర్లు కూడా ప్రణతి కావడం విశేషం. ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి కాగా.. మంచు మనోజ్ భార్య ప్రణతి రెడ్డి. కానీ మ‌నోజ్ విడాకులు ఇచ్చారు. ఇంకో పెళ్లి చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య సంతానం కాగా, మంచు మనోజ్ మోహన్ బాబు రెండవ భార్య సంతానం.

Admin

Recent Posts