చిట్కాలు

పంటి నొప్పి స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయండి చాలు..

ఇప్పుడున్న జీవనవిధానం వల్ల, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల, చాలా మందికి సాధారణంగా వచ్చే సమస్య పంటి నొప్పి సమస్య. దీనికి ప్రధాన కారణం ఏంటంటే. .పిల్లలుకాని, పెద్దలు కానీ ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం, క్యాల్షియం తక్కువగా ఉండడం,నీటిలో ప్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ పై వున్న డెంటిన్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల పళ్ళ సమస్య మొదలవుతుంది.అయితే ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను వాడుతుంటాం. కానీ అవి ఏవి ఉపశమనం కలిగించలేక పోతున్నాయి.పంటి నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలగటానికి మన పెద్దలు ఆచరించి మనకందించిన ఆయుర్వేద చిట్కాలెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక పంటి నొప్పికి లవంగం అనేది చాలా తొందరగా పని చేస్తుంది. ఈ పరిహారాన్ని కొన్ని శతాబ్దాలు క్రితమే ఆయుర్వేద శాస్త్రంలో కొనుగొన్నారు. లవంగం ను పంటినొప్పి ఎక్కడ వుందో ఆ వైపున రెండూ లేదా మూడు లవంగాలు పెట్టుకొని చప్పరిస్తూ వుంటే కొద్ది నిముషాల్లోనే ఉపశమనం కలుగుతుంది.

follow these wonderful home remedies to get rid of teeth pain

అలాగే ఇంగువ పంటి నొప్పికి చాలా అద్భుతమైన ఆయుర్వేద చిట్కా అని చెప్పవచ్చు. పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందడానికి రెండు నుంచి మూడు చిటికెల ఇంగువలో రెండు నుంచి నాలుగు చుక్కల నిమ్మరసంని మిక్స్ చేసి, ఆ పేస్ట్‌ను మీ పళ్లపై మర్ధన చేస్తే ఉపశమనం లభిస్తుంది.

ఇంకా అలాగే ఉప్పు అనేక రోగాలకు వెంటనే ఉపశమనం కలిగించే మంచి ఆయుర్వేద చిట్కా . ఇక పంటి నొప్పిని వెంటనే తగ్గించడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కలిపి, ఆపై ఆ నీటిని గంటకి ఒకసారి పుక్కలిస్తూ ఉండాలి.ఇక ఇలా పుక్కిలించడం వల్ల పంటి సమస్యకు ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts