బల్గేరియాలో పుట్టిన ఓ సాధారణ మహిళ – కానీ ఆమె పేరు వినగానే ప్రపంచంలోని ప్రజలు ఆశ్చర్యపోతారు, కొందరు భయపడతారు కూడా! ఆమె పేరే బాబా వంగా. ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజమవడం వల్ల, ఆమెను బాల్కన్ నోస్ట్రడామస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె చెబుతుండేవారు , ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నాలో ప్రవేశించి, నా శరీరాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి నేను చూడలేను కానీ, లోతుగా అనుభవించగలిగాను. ఆమె కళ్ళు కనిపించనప్పటికీ, భవిష్యత్తు కనిపిస్తుందని చెబుతుండేది. ఆమె చెప్పిన జోస్యాలు ఇలా ఉన్నాయి.
చెర్నోబిల్ అణు విపత్తు (1986).. ప్రిన్సెస్ డయానా మరణం (1997).. 9/11 అమెరికా టవర్ దాడులు (2001).. సిరియాలో యుద్ధం.. బ్రెగ్జిట్ (UK – యూరోప్ నుండి బయటపడటం).. బరాక్ ఒబామా – అమెరికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు అవుతాడని చెప్పింది. తన మరణం కూడా ముందే చెప్పింది – 1996లో తన మరణం జరుగుతుందని చెప్పి, అదే ఏడాది మృతి చెందింది.
భవిష్యత్తుపై ఆమె చెప్పిన జోస్యాలు.. ఆమె 2025, 2043, 2088, 3005, 5079 వంటి సంవత్సరాల వరకూ జోస్యాలు చెప్పింది. 2043లో ఇస్లాం యూరోపును పాలిస్తుంది. 2088లో మనుషులు వృద్ధత్వాన్ని అధిగమిస్తారు – చాలా కాలం బతుకుతారు. 5079లో ఈ భూమిపై జీవం అంతం అవుతుంది.