Headache : మనం ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పి బారిన పడుతూ ఉంటాం. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, అధిక రక్తపోటు, జలుబు వంటి వాటి వల్ల మనం ఈ తలనొప్పి బారిన పడుతూ ఉంటాం. ఈ తలనొప్పి నుండి బయట పడడానికి తలనొప్పి మాత్రలను ఉపయోగిస్తారు. కొందరు టీ, కాఫీ లను తాగుతూ ఉంటారు. కొందరు తలకు ఏవేవో తైలాలను రాస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కోసారి ఈ తలనొప్పి తగ్గదు.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గని ఈ తలనొప్పిని మనం కేవలం మన వంటింట్లో ఉండే దాల్చిన చెక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి, కణతలకు బాగా పట్టించాలి.
తరువాత ఒక గిన్నెలో పావు లీటర్ నీటిని పోసి అందులో 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలను వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా వెంటనే తగ్గుతుంది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఇలా దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.