Copper Water : రాగిపాత్ర‌లో నిల్వ చేసిన నీటిని త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Copper Water : ఈ భూమి మీద ఉన్న ప్ర‌తి జీవ‌రాశికి నీరు ఎంతో అవ‌స‌రం. అలాగే మ‌న‌కు కూడా నీరు చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరం 75 శాతానికి పైగా నీటితో నిండి ఉంటుంది. మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి కూడా మ‌న‌కు నీరు ఎంతో అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ప్ర‌స్తుతం మ‌నం ప్లాస్టిక్ బాటిల్స్ లో, స్టీల్ పాత్ర‌ల‌లో ఉంచిన నీటిని తాగుతున్నాం కానీ పూర్వ‌కాలంలో చాలా వ‌ర‌కు రాగి పాత్ర‌ల‌లో నిల్వ ఉంచిన నీటిని మాత్ర‌మే తాగేవారు. నీటిని తాగ‌డానికి కూడా రాగి చెంబుల‌ను ఉప‌యోగించేవారు. క‌నుక‌నే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.

మ‌న ఇండ్ల‌ల్లో పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న రాగి బిందెలు, పాత్ర‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలియ‌క వాటిని వాడ‌కుండా అలాగే భ‌ద్ర‌ప‌రుచుకుంటున్నాం. ఈ రోజుల్లో మ‌నం నీటిని ప్యూరిపైయ‌ర్ల‌ను ఉప‌యోగించి శుద్ది చేసుకుని మ‌రీ తాగుతున్నాం. కానీ రాగిపాత్ర‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి ఫ్యూరిఫైయ‌ర్ల‌ను ఉప‌యోగించాల్సిన ప‌ని ఉండ‌దు. రాగి స‌హ‌జ సిద్దంగా నీటిని శుద్ది చేస్తుంది. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ చేసి ఆ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల ఉండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ చేసుకుని తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

we must drink Copper Water daily know the reasons
Copper Water

రాగి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. బ‌రువు కూడా తగ్గుతారు. గాయాల‌ను త్వ‌ర‌గా మానేలా చేసే గుణం కూడా రాగిలో పుష్క‌లంగా ఉంటుంది. రాగి పాత్ర‌లోని నీటిని తాగ‌డం వల్ల గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. వాత‌, క‌ఫ‌, పిత్త‌ రోగాలు మ‌న ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల కాలేయం, మూత్ర‌పిండాల ప‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది. రాగి పాత్ర‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు తొల‌గిపోతాయి. థైరాయిడ్ గ్రంధి ప‌నితీరు పెరుగుతుంది.

రాగి పాత్ర‌లో నీటిని తాగితే మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. ర‌క్తహీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే నొప్పులు , వాపులు త‌గ్గుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. రాగి పాత్ర‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగుప‌డుతుంది. ఈ విధంగా రాగి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల రోగాలు న‌యం అవ‌డంతోపాటు మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని, అలాగే రాగి పాత్ర‌లో నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే వ‌ర్షాకాలం సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక క్రిములు సిద్ధంగా ఉండ‌డంతోపాటు ఇన్ఫెక్ష‌న్లు, జ్వ‌రాలు కూడా వ‌స్తుంటాయి. క‌నుక వాటిని త‌ట్టుకునేలా రోగ నిరోధ‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. రోజూ రాగి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగాల‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక రోజూ అలా నీటిని తాగ‌డం మంచిది. దీంతో రోగాలు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts