Fungal Infections : గజ్జి, తామర మనల్ని వేధించే చర్మ వ్యాధుల్లో ఇవి కూడా ఒకటి. ఈ చర్మ సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల కారణంగా వచ్చే ఈ సమస్యలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ సమస్యల కారణంగా విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఈ సమస్యలతో ఎంతో అవస్థ పడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్యలు ఎంతకి తగ్గవు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఈ గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను మనం ఒక చక్కటి ఆయుర్వేద చిట్కా ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.
గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను తగ్గించే చిట్కా ఏమిటి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం పచ్చి బొప్పాయిని, పసుపు, అలోవెరా జెల్ ను, విటమిన్ ఇ క్యాప్సుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పచ్చి బొప్పాయిని ముక్కలుగా కట్ చేయాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్న భాగాన్ని వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి.
కనీసం మిశ్రమాన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ చిట్కాను క్రమం తప్పకుండా సమస్య తగ్గే వరకు వాడాలి. ఈ చిట్కాను వాడిన రెండు రోజుల్లోనే సమస్య తగ్గడాన్ని మనం గమనించవచ్చు. పచ్చి బొప్పాయి, పసుపు, కలబంద జెల్ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గజ్జి, తామర వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈ విధంగా ఆయుర్వేద చిట్కాను వాడి ఎంతో కాలంగా వేధిస్తున్న గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.