Gas Trouble Remedies : నేటి తరుణంలో మనలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, తరచూ ఆహారాన్ని తీసుకోవడం, మలబద్దకం, ఆమ్లత్వం కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటి సమస్య తలెత్తగానే చాలా మంది మందులను, సిరప్ లను తాగుతూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికి వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి.
కనుక సహజ సిద్ద చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం. ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో పాలు, నెయ్యి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 20 ఎమ్ ఎల్ కాచి చల్లార్చిన పాలు, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి కలిపి తాగాలి.ఎసిడిటీ సమస్య తలెత్తినప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నెయ్యి తీసుకోవడం ఇష్టంలేని వారు భోజనం చేసిన తరువాత చల్లటి పాలను తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే మనకు తేలికగా లభించే పదార్థాలతో ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ పసుపు, నల్ల ఉప్పు, జీలకర్ర, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో జీలకర్ర వేసి వేడి చేయాలి.
జీలకర్రను చక్కగా వేగిన తరువాత దానిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిలో వేడి చేసిన అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసాన్ని వేడి చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయను కట్ చేసి దానిని నేరుగా మంటపై ఉంచి 30 నుండి 40 సెకన్ల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నిమ్మకాయ నుండి రసాన్ని పిండి వాడుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు తీసుకోవడం వల్ల వెంటనే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు.
ఈ చిట్కాను వాడడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మజ్జిగను తాగడం వల్ల కూడా మనం ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. దీని కోసం ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి కలిపి తాగాలి. ఇలా రోజూ భోజనం చేసిన తరువాత ఎసిడిటీ సమస్య నుండి చాలా తేలికగా తగ్గుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా ఈచిట్కాలను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.