చిట్కాలు

Green Gram For Beauty : పెస‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Green Gram For Beauty : పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. కొంద‌రు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెస‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు, ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను తీసుకుని వాటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని గ్రైండ్ చేయాలి. దాన్ని ఫేస్‌ప్యాక్‌గా మార్చుకుని ముఖానికి రాయాలి. 15 – 20 నిమిషాలు ఆగాక ప్యాక్ డ్రై అవ్వ‌గానే నీటితో క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారికి ఈ ప్యాక్ ఎంత‌గానో మేలు చేస్తుంది.

green moong dal for beauty how to use lt

రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని మిక్సీ ప‌ట్టి పేస్ట్‌లా మార్చుకోవాలి. ఆ మిశ్ర‌మంలో అర టీస్పూన్ నెయ్యి వేసి బాగా క‌లిపి దాన్ని ముఖంపై అప్లై చేయాలి. ముఖంపై ఆ మిశ్ర‌మాన్ని సున్నితంగా రాస్తూ మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత 10 నిమిషాలు ఆగి గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెస‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని అందులో చ‌ల్ల‌ని పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై లేదా శరీరంలోని ఇత‌ర ప్ర‌దేశాల‌పై అప్లై చేయాలి. 5-10 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎండ‌లో కందిన చ‌ర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.

Admin

Recent Posts