lifestyle

Vastu Tips : చేతి నుంచి ఈ వ‌స్తువులు అస‌లు జారిపోకూడ‌దు.. వాస్తు ప్ర‌కారం న‌ష్టం జ‌రుగుతుంది..!

Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. ఇంటిని నిర్మించేటప్పుడు కూడా, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం, ప్రతి పనికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది. కొంత మంది, వాస్తు నియమాలని, మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. మరి కొందరు కచ్చితంగా వాస్తు నియమాలని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఎప్పుడూ కూడా చెయ్యి నుండి జారిపోకూడదు.

ఇవి జారిపోతే అసలు మంచిది కాదట. మరి చేతి నుండి అసలు జారిపోకూడని వాటి గురించి చూద్దాం. వాస్తు ప్రకారం చేతి నుండి పాలు జారిపోకూడదు. పాలు చేతి నుండి జారిపోతే, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయని వాస్తు పండితులు అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం కూడా ఉంది అని పండితులు చెప్పడం జరిగింది. గృహప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిది.

make sure that no item from your hand slips

కానీ, ప్రతిరోజు మంచిది కాదని పండితులు అంటున్నారు. అలానే, వాస్తు ప్రకారం చేతి నుండి ఉప్పు జారిపోవడం మంచిది కాదు. ఇలా జరగడం వలన డబ్బుకి కొరత ఏర్పడుతుంది. ఉప్పు చెయ్యి జారితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు పండితులు చెప్తున్నారు. కాబట్టి, పొరపాటున కూడా ఈ తప్పు జరగకుండా చూసుకోండి.

అలానే, వాస్తు ప్రకారం బియ్యం కానీ గోధుమలు కానీ చేతి నుండి కిందకి జారి పడిపోకూడదు. ఆహార కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ రెండూ కూడా చేయి జారిపోకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే ఆహార పదార్థాలని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. కొన్ని కొన్ని పొరపాట్ల వలన, చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తప్పులు జరగకుండా చూసుకోండి.

Admin

Recent Posts