Guava Leaves For Hair : జామ ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది.. ఏం చేయాలంటే..?

Guava Leaves For Hair : పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ. ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి. దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో. సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామ ఆకుల గురించి మాట్లాడుకుందాం. జామాకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామాకులు కరెక్ట్. అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జామ ఆకుల‌తో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకుల‌ను నీటిలో ఉడకబెట్టి  ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి.

Guava Leaves For Hair how to use them for better results
Guava Leaves For Hair

అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది. జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు  దృఢంగా తయారవుతాయి. అలాగే జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. కాంతివంతంగా ఉండి మెరుస్తుంది. క‌నుక జుట్టు స‌మ‌స్య‌ల‌కు జామ ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Editor

Recent Posts