Masala Chach : వేసవికాలంలో చాలా మంది ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. ఇవి చల్లగా ఉన్నప్పటికి వీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక పెరుగుతో మజ్జిగ, లస్సీ వంటి వాటిని తయారు చేసుకుని తాగడం ఉత్తమం. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవే కాకుండా పెరుగుతో మనం మసాలా చాచ్ ను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. పెరుగుతో చేసే ఈ మసాలా చాచ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగడం వల్లరుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పెరుగుతో రుచిగా మసాలా చాచ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా చాచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – 3 కప్పులు, నీళ్లు – 3 కప్పులు, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పుదీనా – ఒక చిన్న కట్ట, బ్లాక్ సాల్ట్ – తగినంత, ఐస్ క్యూబ్స్ – 6.
మసాలా చాచ్ తయారీ విధానం..
ముందుగా బ్లెండర్ లో పెరుగును తీసుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్,ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపై చిన్నగా తరిగిన పుదీనాను వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా చాచ్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వేసవి కాలంలో ఈ విధంగా పెరుగుతో మసాలా చాచ్ ను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఎండ నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు.